కత్తి మహేష్, పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య జరుగుతున్న వివాదంలోకి చిన్న ట్వీట్ ద్వారా ఎంటరైన పూనమ్ కౌర్ మరోసారి సంచలన ట్వీట్ చేశారు.పవన్ కల్యాణ్ ఒక వ్యక్తికాదు.. ఒక శక్తి .. ఆ శక్తి ముందు ఎవరైనా కరిగిపోవాల్సిందే అనే విధంగా పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
'' sanctity of THOUGHT is POWER…rather DIVINE POWER'' #pklove …. any more to come ????
— Poonam Kaur Lal (@poonamkaurlal) January 20, 2018
‘‘పవిత్రంగా ఉండాలనే ఆలోచనే ఒక శక్తి. అది దైవశక్తి కంటే గొప్పది. అదే పీకే ప్రేమ. తెలుసుకోవాల్సింది ఇంకా ఏదైనా ఉందా? ఇంకా ఎవరైనా వస్తారా?’’ అంటూ ఆమె ట్వీట్ చేసింది.అయితే ఈ ట్వీట్ ను చుసిన అభిమానులు కొందరు గర్వపడుతుంటే, ఇప్పటి వరకు జరిగింది చాలు.. మళ్లీ కెలకవద్దు అంటూ నెటిజన్లు రిప్లైలు ఇస్తున్నారు. కాగా ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు, ‘సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ల మధ్య మాటల యుద్ధంకి ఫుల్ స్టాప్ పడిన విషయం తెలిసిందే.