తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అవినీతి నిరోధక శాఖ అడిషనల్ ఎస్సీ సునీతారెడ్డి, కల్వకుర్తి సిఐ మల్లిఖార్జున రెడ్డి అక్రమ సంబంధం వ్యవహారం కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అమెరికాలో ఉంటున్న అడిషనల్ ఎస్పీ సునీతారెడ్డి భర్త తన భార్య సునీతారెడ్డికి చెప్పకుండానే ఇండియా వచ్చి రెండురోజులపాటు మాటు వేసి మల్లిఖార్జునరెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విషయం తెలిసిందే. తర్వాత మల్లిఖార్జునరెడ్డికి చెప్పు దెబ్బలు, ఉరికించి కొట్టుడు. సునీతారెడ్డి భర్త, అత్త, తల్లి అందరూ కలిసే మల్లిఖార్జునరెడ్డిని చితకబాదారు.
అయితే ఈకేసులో అనూహ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో దెబ్బలు తిన్న కల్వకుర్తి సిఐ మల్లిఖార్జునరెడ్డి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. అడిషనల్ ఎస్పీ సునీతారెడ్డితో తనకు గత ఐదేళ్లుగా పరిచయం ఉందని తెలిపాడు. అడిషనల్ ఎస్పీ సునీతారెడ్డి విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని.. ఆమెకు డైవర్స్ వచ్చాక తాను ఆమె మ్యారేజ్ చేసుకోవాలన్నామని చెప్పాడు. ఆదివారం రాత్రి సునీతారెడ్డిని డ్రాప్ చేయడం కోసమే ఆమె ఇంటికి వెళ్ళానని.. వేరే కారణాలేమీ లేవన్నారు. తనకు ఆమెతో ఉన్నది ఇల్లీగల్ కాంటాక్ట్ కాదని.. అఫీషియల్ గా నే మ్యారేజ్ చేసుకుంటామని వెల్లడించాడు.మల్లిఖార్జునరెడ్డి మరో విషయాన్న కూడా వెల్లడించాడు. తన భార్యతో తాను సఖ్యంగా లేనని.. చాలా కాలంగా తన భార్యతో దూరంగా ఉంటున్నట్లు చెప్పాడు. త్వరలోనే మీడియా ముందుకు ఇద్దరం వచ్చి అన్న విషయాలు చెబుతామని పేర్కొన్నాడు.