ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతరైన మేడారం జాతరకు వచ్చేనెల 2న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లనున్నారు.అయితే అదే రోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా మేడారానికి వచ్చే అవకాశం వుంది .ఈ నేపధ్యంలో ఈ నెల 31 నుండి ఫిబ్రవరి 3వరకు జరగనున్న సమ్మక ,సారలమ్మ జాతరకు సంబంధించిన ఏర్పాట్లన్నీపూర్తయ్యాయని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. మేడారం జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసిందన్నారు.జాతరకోసం రూ.80.55 కోట్లు కేటాయించమన్నారు.ఈ జాతరకు వచ్చే భక్తులను దృష్టిలోవుంచుకొని ఎలాంటి అవాంచనీ య సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారన్నారు.రాష్ట్రంలోని అన్నిజిల్లాలనుండి జాతరకు వచ్చే వీలుగా వివిధ ప్రాంతాల నుండి 4200 ఆర్టిసీ బస్సులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
