గుంటూరు ప్లీనరీలో ప్రతిపక్ష నేత జగన్ ప్రకటించిన ‘నవరత్న’ పథకాలు టీడీపీ సర్కారుకు టెన్షన్ పుట్టిస్తున్నట్టు వైసీపీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. జగన్ ప్రకటించిన ఆ తొమ్మిది పథకాలు చంద్రబాబుకు వణుకు పుట్టిస్తోందని అంటున్నారు. ఈ నవరత్నాల మాట బయటకి రాగానే ప్రభుత్వం పనిగట్టుకుని టీడీపీ నేతలతో వియర్శిస్తుంది. అంతేగాక జగన్ మద్య నిషేధం ప్రకటించేసరికి టెన్షన్ పట్టుకుందనీ వైసీపీ నేతలు అభివర్ణిస్తున్నారు. జగన్ ప్రకటించిన పథకాలపైనే క్యాబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగిందని వారు చెప్పుకుంటున్నారు.
మరోపక్క
వైసీపీ అధినేత జగన్ గత ఎడాది నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయి నుండి చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా రైతుల నుంచి ఆదరణ కనిపిస్తోంది. రైతుల సమస్యలపై నిర్మాణాత్మక ఆలోచనలు పరిష్కారాలతో ఆయన స్పష్టత కలిగి ఉండడం… ఆచరణ సాధ్యమైనవి రైతులకు అత్యంత ఉపయోగమైనవి హామీలు ఇస్తుండడంతో వారి నుంచి సానుకూల స్పందన వస్తోంది. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానన్న విషయంలో జగన్ చేసిన తాజా ప్రకటన రైతులను ఆకర్షిస్తోంది. ఇంకా నిరుద్యోలకు భరోసానిస్తు …మహిళలకు, ఉద్యోగస్తులకు ఇలా ప్రతి ఒక్కరి సమస్యలను తమ సమస్యఅనుకొని మీ కష్టాలను నేను తీరుస్తా అని చేబుతుంటే వారి ఆనందానికి హద్దులేవు అని తెలుస్తుంది. గత నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు పాలనపై ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైన వ్యతీరేకత ఉంది. అమలు కాని అపద్దపు మాటలు చేప్పి ..ఓట్లు వేయించుకోని చాల దారుణంగా మోసం చేశాడని ప్రజలు 100% నమ్ముతున్నట్లు చంద్రబాబుకి తెలిసిపోయిందని వైసీపీ నేతలు అంటున్నారు. దీంతో చంద్రబాబు లో భయం మొదలైయ్యిందంట. ఇక 2019 లో గెలవలంటే ఏమీ చేయ్యాలి అనే ఆలోచనలో పడ్డారని ప్రతిపక్షం అంటున్నది.
