తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. తాజాగా ఇవాళ నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం బట్టు వెంకన్న బావి తండా నుంచి సుమారు 600 మంది ఇతర పార్టీల కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. కర్ణ బ్రహ్మానంద రెడ్డి, నోముల నర్సింహయ్య సహకారంతో మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న పలు ప్రజాభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ..బంగారు తెలంగాణ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించడానికి పార్టీ మారుతున్నామని వారు తెలిపారు
