భారతదేశ 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం.. సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ త్రివిధ దళాల గౌరవ వందం స్వీకరించి.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన శకటాలను తిలకించారు.అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
