కేవీబీ రెడ్డి ఎల్ అండ్ టి మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు.. కేవీబీ నియామకంపై ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని మెట్రో రైల్ (హైదరాబాద్) సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఎల్ & టి ఎండి, సీఈఓ ఎన్ఎస్ సుబ్రహ్మణ్యన్ కు త్వరలోనే కేవీబీ రెడ్డి రిపోర్ట్ చేయనున్నారు. భోపాల్ లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ (NIT) నుంచిమెకానికల్ ఇంజనీరింగ్ లో ఆయన డిగ్రీ పూర్తి చేశారు. 1983లో ఢిల్లీలోని NTPCలో తన కెరీర్ ని ప్రారంభించారు. ఎస్సార్ పవర్ లిమిటెడ్ సీఈఓ గా ఆయన పని చేశారు. గత ఇరవై రెండేళ్లుగా ఈ సంస్థతో ఆయనకు అనుబంధం ఉంది.
