దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించారు.అనంతరం రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి ,సంక్షేమ పథకాల అమలులో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే విద్యుత్ కోతలను అధిగమించి ఇప్పుడు ఏకంగా వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందించడం గర్వకారణమన్నారు.ఈ ఏడాది నుంచి రైతులకు పంట పెట్టుబడి అందిస్తున్నట్లు తెలిపారు . పేద ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తోందన్నారు. వృద్ధులు, వితంతువులతోపాటు ఒంటరి మహిళలకు పింఛన్ ఇస్తున్నమన్నారు.
