ఈ నెల 31 నుండి ఫిబ్రవరి ౩ వరకు జరగనున్న మేడారం సమ్మక్క సారలమ్మ జతరకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేసిన విషయం తెలిసిందే.ఈ జతరకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక RTC బస్సులను నడుపుతున్ననట్లు ప్రకటించగా..ఇప్పుడు రైల్వే కూడా స్పైషల్ ట్రైన్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.ఈ క్రమంలోనే సౌత్ సెంట్రల్ రైల్వే 16 ప్రత్యేక రైళ్లను నడపనుంది.ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు దక్షిణమధ్య రైల్వే ఈ రైళ్లను నడపనున్నట్లు తెలిపింది సికింద్రాబాద్ నుంచి వరంగల్ వరకు 8 రైళ్లు. కాజీపేట్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ వరకు 2 రెళ్లు. సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి ఖమ్మం వరకు 6 రైళ్లు నడవనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు అన్ని ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి.
