నిత్యం ఎన్నో సంచలనాలకి కేంద్ర బిందువుగా మారుతున్నా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై అతని దగ్గర పనిచేసిన రచయిత పి.జయ కుమార్ సంచలన ఆరోపణలు చేశాడు.ఆయన మాట్లాడుతూ తన స్ర్కిప్ట్ను కాపీ కొట్టి వర్మ ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ షార్ట్ఫిల్మ్ తీశారని ఆరోపిస్తున్నారు .
తాజాగా అతనిలో మరో మనిషి ఉన్నాడని ఆయన అంటున్నారు .ఈ క్రమంలో విజయవంతమైన దర్శకులతో వర్క్ చేస్తూ ఫ్యూచర్
బాగుంటుందని ఆశించడం ప్రస్తుత ఇండస్ట్రీలో సహజం. అలానే నేను వర్మతో పనిచేశా. ఆయనలో స్వలింగసంపర్క స్వభావం ఉందని ఎప్పుడు చెప్పాలనుకోలేదు. కాని ఇప్పుడు టైం వచ్చింది.
హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్ స్టీన్ పై మీ టూ ఉద్యమం ద్వారా ఆయన లైంగిక వేధింపుల ఆరోపణలు ఎలా బయటపెట్టారో, అదే మాదిరిగా ఎందరో కళాకారులని, రచయితలని వేధించిన వర్మ లైంగిక వేధింపులకి సంబంధించి మీ టూ ఆర్జీవి పేరుతో తలపెట్టిన క్యాంపెయిన్ లో పాల్గొనాలి అని జయకుమార్ అన్నాడు.