“మనసున్న మారాజు..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్” అని మరోసారు రుజువయ్యింది .తాజాగా . రాష్ట్రంలోని వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండకు చెందిన గొదెల కుమారస్వామి, మంజుల దంపతులు కుటుంబంతో కలిసి వరంగల్ బీట్‌బజారులో హమాలీ పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. రెండో తరగతి చదువుతున్న వీరి కుమార్తె జ్యోత్స్న బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నది. చిన్నారికి వైద్య చికిత్స కోసం ఆర్థికసాయం అందజేయాలని బాధితురాలి కుటుంబసభ్యులు వేలేరు సర్పంచ్ విజయపురి మల్లికార్జున్‌ను సంప్రదించగా, ఆయన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని కలిసి సమస్యను వివరించారు.వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి..ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ప్రత్యేకంగా మాట్లాడి బాలిక చికిత్స కోసం రూ.15 లక్షలను సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును చిన్నారి కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ సందర్బంగా జ్యోత్స్న తల్లిదండ్రులు మాట్లాడుతూ..మా కూతురి సమస్యకు వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు , డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి మేము జీవితాంతం ఋణపడిఉంటామన్నారు.ప్రజలకు మంచి చేయాలనే గొప్ప మనసున్న మహారాజు ముఖ్యమంత్రి కేసీఆర్ అని వారు కొనియాడారు.
