Home / SLIDER / తెలంగాణలో లూలూ.. రూ. 2,500 కోట్లు పెట్టుబడులు..!

తెలంగాణలో లూలూ.. రూ. 2,500 కోట్లు పెట్టుబడులు..!

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విదేశీ పర్యటన నిమిత్తం గత 15 రోజులు జపాన్ ,దావోస్ ,దుబాయ్ లో పర్యటించి ఇవాళ వేకువజామున హైదరాబాద్ మహానగరానికి చేరుకున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో మంత్రి కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి  విదేశీ కంపెనీలు క్యూ కడుతున్నాయి . దుబాయ్‌కి చెందిన రెండు ప్రముఖ కంపెనీలు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. రూ.3500కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో పలు ఒప్పందాలు కుదుర్చుకొన్నాయి. వివరాల్లోకి వెళ్తే..ఆదివారం యూఏఈ పర్యటనలో ఉన్న మంత్రి కే తారకరామారావు, అబూ ధాబీకి చెందిన ప్రముఖ సంస్థ లూలూ గ్రూపు చైర్మన్ యూసుఫ్ అలీ సమక్షంలో ఆ సంస్థ ప్రతినిధులు, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్.. మూడు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందాల విలువ సుమారు రూ.2500 కోట్లు.

రాష్ట్రంలో 18 లక్షల చదరపు అడుగుల్లో భారీ షాపింగ్ మాల్‌తోపాటు, ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, కూరగాయల ఎగుమతుల యూనిట్లను లూలూ స్థాపిస్తుంది. వీటిద్వారా దాదాపు ఆరువేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మరోవైపు డాక్టర్ బీఆర్ షెట్టి గ్రూప్స్ తెలంగాణలో మూడు ప్రాజెక్టుల నిర్మా ణానికి సుమారు వెయ్యి కోట్ల రూపాయల మేర ఒప్పందాలను కుదుర్చుకొన్నది. మందుల తయారీ, పరిశోధన, వైద్య పరికరాలు, గ్రీన్‌ఫీల్డ్ వైద్యశాలలు, వైద్య, ఇంజినీరింగ్ విద్యాసంస్థల నిర్మాణాన్ని బీఆర్‌ఎస్ వెంచర్స్ చేపడుతుంది.మంత్రి కేటీఆర్, బీఆర్ షెట్టి గ్రూపుల చైర్మన్ బీఆర్ షెట్టిల సమక్షంలో రాష్ట్ర పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, బీఆర్‌ఎస్ వెంచర్స్ ప్రతినిధులు ఈ మేరకు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. రాబోయే మూడునెలల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా వీటి నిర్మాణం ప్రారంభమవుతుంది. మూడు నుంచి ఐదేండ్ల లోపు ఈ సంస్థలు తమ ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తిచేస్తాయి. ఈ కార్యక్రమంలో లూలూ సంస్థ సీఈవో సైఫీ రూపావాలా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అష్రాఫ్ అలీ, సీవోవో సలీమ్, ఓమన్ ఇండియా డైరెక్టర్ అనంత్ ఏవీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat