రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ గెలవడానికి ప్రధాన కారణం అమలు కానీ మోసపూరిత ఆరు వందలకు పైగా ఎన్నికల హామీలు అని ప్రధాన ప్రతి పక్ష పార్టీ వైసీపీ ,ఇతర పార్టీలు అయిన కాంగ్రెస్,సీపీఎం ,సీపీఐ పార్టీలకు చెందిన నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ .అయితే ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా గత నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హమీను కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం .తాజాగా రానున్న ఎన్నికల్లో ఎట్లైన సరే గెలవాలని కసితో టీడీపీ సర్కారు భారీ కుట్రకు తెరతీసింది.
See Also:వైసీపీలోకి టీడీపీ ఎంపీ ..జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్ ..వైసీపీ ఎమ్మెల్యే..
గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు ,మంత్రులు ,ఎమ్మెల్యేలు చేస్తున్న పలు అవినీతి అక్రమాలతో పాటుగా గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రత్యేక హోదా ,విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ లాంటి హామీలను కూడా తుంగలో తొక్కడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొన్నది.దీంతో వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమని భావించిన టీడీపీ సర్కారు వైసీపీ పార్టీకి చెందిన నేతలు ,కార్యకర్తలు ,సానుభూతి పరుల ఓట్లతో పాటుగా ఎవరు అయితే తమకు వ్యతిరేకంగా ఉంటున్నారో వాళ్ళ పేర్లను ఓటర్ల లిస్టు నుండి తప్పించే పనిలో బిజీ బిజీ గా ఉంది.
See Also:కడప నగరంలో సంచలనం ..టీడీపీకి 10 మంది కార్పొరేటర్లు రాజీనామా ..
ఈ క్రమంలో వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు కుటుంబంలో కేవలం ఒక్కరికి మాత్రమే ఓటు ఉంచి మిగతావారికి తొలగించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది.ఈ వ్యవహారం మీద వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం రెండు శాతం ఓట్ల తేడాతోనే గెలిచిన టీడీపీ సర్కారు రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ నేతల కార్యకర్తల ,సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తూ భారీ కుట్రకు తెరతీసింది.ఈ కుట్రను తిప్పికొట్టడానికి వైసీపీ శ్రేణులు ముందుకురావాలని ..లేకపోతే అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమాలతో టీడీపీ గెలవడానికి పక్క ప్రణాళికలు వేస్తుందని ఆయన అన్నారు ..
See Also: ఏపీ ప్రజలకు న్యాయం చేయగల దమ్మున్న ఏకైక నేత జగన్ ..టాలీవుడ్ స్టార్ హీరో…