తెలంగాణ రాష్ట్రంలోనే అత్యాధునిక హంగులతో తొలి మోడల్ రైతుబజార్ భవనాన్ని సిద్దిపేటలో నిర్మించారు. కార్పొరేట్ కార్యాలయం తరహాలో నిర్మించిన ఈ భవనాన్ని ఇవాళ ( సోమవారం ) రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రారంబించారు.ఈ సందర్బంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ..సిద్ధిపేటలోని పాత రైతు బజారు ఒకప్పుడు నూకసాని కుంట. ప్రజలకు, రైతులకు ఇద్దరికీ వసతులు కల్పించేలా అప్పటి ఎమ్మెల్యే, ఇప్పటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు రైతు బజారును ఏర్పాటు చేశారన్నారు.మన తెలంగాణ రాష్ట్రం వచ్చాక రూ.8.16కోట్ల వ్యయంతో సెల్లారు, గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు నిర్మాణం చేపట్టం జరిగిందన్నారు.రైతుల కోసం ప్రతి ఫ్లోర్ లో టాయిలెట్స్, ఎల్ఈడీ లైటింగ్ సదుపాయం, 332 స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు.రైతులు అమ్మకాలు జరిపిన తర్వాత మిగిలిన కూరగాయలను భద్రపర్చుకునేందుకు సెల్లారులో 5మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన కోల్డ్ స్టోరేజీని ఏర్పాటు చేసి..ప్రతి ఫ్లోర్ లో చెత్త బుట్టలు ఏర్పాటు చేశామన్నారు.
see also :వైసీపీ అధినేత సంచలన నిర్ణయం ..ప్రతి తెలుగోడు కాలర్ ఎగరేసే వార్త..
see also : బ్రేకింగ్ న్యూస్: కాంగ్రెస్‌కు చిరంజీవి రాజీనామా..!!
ఈ రైతు బజారులో సిద్ధిపేట, చిన్నకోడూర్, నంగునూరు, దుబ్బాక, తొగుట, మిరుదొడ్డి మండలాల నుంచి 300 నుంచి 350 మంది కూరగాయలు పండించే రైతులు ఇక్కడికి వచ్చి కూరగాయలు అమ్ముకుంటున్నారు.ఈ రైతు బజారులో రోజూ 600 నుంచి 700 క్వింటాళ్ల కూరగాయల అమ్మకాలు జరుగుతాయి. పాత రైతు బజారులో కూరగాయలు అమ్ముకునేందుకు రైతులకు కేవలం 3 షెడ్లు మాత్రమే ఉండేవి.. వాన కాలం, ఎండ కాలంలో సరైన సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు కలిగేవి, ఈ ఇబ్బందులను గుర్తించి రైతు బజారును రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచేలా నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి వివరించారు.కూరగాయలు తీసుకొచ్చిన రైతులు తమ దగ్గర ఉన్న కార్డులు స్వైప్ చేయడం ద్వారా వారికి ఆ మిషన్ నుంచి టోకెన్ నెంబరు వస్తుందని., టోకెన్లలో ఉన్న ఆ నెంబరు ఉన్న స్టాల్ లో రైతులు కూర్చునే సదుపాయం చేసినట్లు మంత్రి వివరించారు.వినియోగదారులు, రైతుల కోసం తూకంలో ఏలాంటి ఇబ్బందులు లేకుండా 400 ఎలక్ట్రానిక్ మిషనరీలను ఏర్పాటు చేశామన్నారు. రైతులు, వినియోగదారుల కోసం ఆంధ్రాబ్యాంకు ఏటీఎం కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ఈ సందర్బంగా తెలిపారు.
see also: వైసీపీలో చేరిక గురించి ఆలోచిస్తా..వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే…
see also : ఛి..ఛ్చీ… చంద్రబాబు నాకు బంధువా..!!