ఇటివల కేంద్రం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ మీద తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంపీ కవిత స్పందించారు .ఎంపీ కవిత మాట్లాడుతూ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద రైతాంగం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు .దేశంలో ఉన్న వ్యాపార రంగానికిచ్చిన ప్రాధాన్యత వ్యవసాయ రంగానికి ఇవ్వలేదని ఆమె తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.బడ్జెట్ లో సాగునీటి ప్రాజెక్టులకు అంతగా నిధులు కేటాయించకపోవడం రైతుల పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నారో అర్ధమవుతుందని ఆమె అన్నారు . పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీకి తాము మద్దతు ఇచ్చినా.. కేంద్రం మాత్రం రైతులకు అండగా నిలువలేకపోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశంలో ఎరువుల ఉత్పత్తులను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. సబ్సిడీపై రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కవిత ప్రశ్నించారు. అయితే మరో నాలుగు యేండ్లల్లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని బీరాలు పలికిన కేంద్రం ప్రస్తుతం.. బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా ఎలా రెట్టింపు చేస్తారని ఆమె నిలదీశారు.
see also : ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వైఎస్ భారతి ఎంట్రీ …వైసీపీ క్లారిటీ…
see also :కేంద్రమంత్రి హర్షవర్దన్ తో మంత్రి కేటీఆర్ కీలక భేటి