తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట మినీ స్టేడియంలో టీ 20- 20 క్రికెట్ మ్యాచ్ శుక్రవారం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు.ఈ క్రికెట్ మ్యాచ్ కి మొదట మంత్రి హరీష్ రావు టాస్ వేశారు.సిద్దిపేటలో టీ20 లీగ్ మ్యాచ్ లు జరగడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
సిద్దిపేట ఇక మినీ స్టేడియం కాదని.. ఈ స్టేడియంకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చేలా కృషి చేస్తానని హరీష్ ప్రకటించారు.ప్రత్యేకంగా ఇక్కడ ఈ లీగ్ మ్యాచ్ లు జరగడానికి కృషి చేసిన HCA కు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.రాష్ట్రంలో రెండవ వేదిక గా సిద్దిపేట స్టేడియాన్ని ఎంపిక చేసుకోవం చాలా సంతోషంగా ఉందన్నారు.స్టేడియం అభివృద్ధి చేయడానికిఇక్కడ క్రీడాకారుల్లో ఉత్సహం కారణమని మంత్రి వ్యాఖ్యానించారు.
సిద్దిపేట క్రీడకారుల్లో ఉన్న ఆసక్తి తోనే మినీ స్టేడియం అభివృద్ధి చేసామన్నారు.త్వరలో సిద్దిపేటను క్రిడా హబ్ గా చేస్తామని హరీశ్ రావు చెప్పారు.డే అండ్ నైట్ మ్యాచ్ లు అయ్యే విధంగా 15రోజుల్లో ప్లడ్ లైట్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.సిద్దిపేట లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహిస్తామని తెలిపారు. వారికి అన్ని విధాలా అండగా ఉండి సహకారం అందిస్తానన్నారు.అన్ని క్రీడలలోనూ సిద్దిపేట క్రీడా కారులు నైపుణ్యాలను పెంచుకోవాలని కోరారు.క్రికెట్ తో పాటు అథ్లెటిక్ లాంటి వాటిలో కూడా ముందు ఉండాలని సూచించారు.
స్థానిక క్రీడా కారులు రాష్ట్ర ,జాతీయ స్థాయిలో క్రికెట్ పోటీల్లో క్రిడా కారులు ముందు ఉండాలని అభిలషించారు.అంతర్జాతీయ గుర్తింపు వచ్చే విధంగా స్టేడియాన్ని ఇంకా మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు..మ్యాచ్ ని మంత్రి హరీష్ రావు,ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, HCA అధ్యక్షలు జి. వివేక్, సిద్దిపేట చైర్మన్ రాజనర్స్,మున్సిపల్ కౌన్సిలర్స్. అభిమానులు ప్రత్యక్షంగా తిలకించారు.