తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సోషల్ మీడియాలో ఎంత ఆక్టివ్ గా ఉంటారో మనందరికి తెలిసిన విషయమే.తాజా చిత్రాలను చూసి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ ఉంటారు.తాజాగా నిన్న రాత్రి (శనివారం ) తొలిప్రేమ చిత్రాన్ని చూసి మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌లో తెలియజేశారు .‘‘శనివారం రాత్రి అద్భుతంగా గడిచింది. తొలిప్రేమ లాంటి ఓ సున్నితమైన ప్రేమకథను చూశాను. దర్శకుడు వెంకీ అట్లూరి బాగా తెరకెక్కించాడు. రాశీ ఖన్నా, వరుణ్ తేజ్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ముఖ్యంగా మంచి సాహిత్యం.. దానికి థమన్ టెర్రిఫిక్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. మంత్రి ట్వీట్ కు వెంటనే స్పందించిన థమన్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ రీట్వీట్ చేయగా.. గ్రేట్ జాబ్ అంటూ కేటీఆర్ మరో ట్వీట్‌తో అభినందనలు తెలిపారు.
@KTRTRS dear sir thanks so much for watching #tholiprema sir felt very happy to get super warm wishes from u sir . Our team felt so so happY
Getting this from or favourite leader ♥️
Thanks once again sir
This one is from our heart 🙂
Wishing u all the very best sir ♥️ pic.twitter.com/gdWM7FwPQt— thaman S (@MusicThaman) February 11, 2018
Great Job Thaman ? BG & Music was outstanding and so were lyrics. My compliments https://t.co/q7tk5BmbSj
— KTR (@KTRTRS) February 11, 2018
Saturday night well spent. Watched a sensitive love story in Telugu after a while
‘Tholi Prema’ is well directed by @dirvenky_atluri terrific music, lyrics & background score, fabulous cinematography & absolutely brilliant performances by @IAmVarunTej & @RaashiKhanna ??
— KTR (@KTRTRS) February 10, 2018