ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎనబై ఐదు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.నెల్లూరు జిల్లాలో గత పద్దెనిమిది రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు .జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది .
అయితే జిల్లాలో సూళ్ళూరు పేట నుండి మొదలైన జగన్ పాదయాత్ర గూడూరు,వెంకటగిరి ,సర్వేపల్లి,నెల్లూరు రూరల్ ,ఆత్మకూరు ,కోవూరు,కావాలి నియోజక వర్గాల్లో పూర్తయింది .ప్రస్తుతం జిల్లాలో ఉదయగిరి అసెంబ్లీ నియోజక వర్గంలో జగన్ పాదయాత్ర చేస్తున్నారు .అయితే ఈ పాదయాత్ర సందర్భంగా జగన్ జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
జిల్లాలోపాదయాత్రలో భాగంగా నాయుడుపేట లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సూళ్ళూరు పేట అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యేగా ఉన్న కిలివేటి సంజీవయ్య పేరును ఖరారు చేస్తూ వచ్చే ఎన్నికల్లో కూడా సంజీవయ్యకు మద్దతు ఇవ్వాలని జగన్ ప్రజలను కోరారు .ఆ తర్వాత నెల్లూరు సిటి ఎమ్మెల్యేగా ఉన్న యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను ఖరారు చేసినట్లు జగన్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి .ఇప్పటికే కర్నూలు జిల్లాలో పత్తికొండ అసెంబ్లీ నియోజక వర్గానికి శ్రీదేవిని ,చిత్తూరు జిల్లాలో కుప్పం అసెంబ్లీ నియోజక వర్గ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి పేరును జగన్ ఖరారు చేసిన సంగతి తెల్సిందే.