ప్రముఖ రిలియన్స్ జియో సంస్థ ప్రేమికుల రోజు శుభవార్త తెలిపింది.ఇప్పటికే అఫర్లపై ఆఫర్లు ప్రకటిస్తూ సంచలనం సృష్టిస్తున్న జియో..ఇప్పుడు కొత్తగా ‘కై’ ఓఎస్‌తో పనిచేసే ఫేస్‌బుక్ యాప్‌ను అభివృద్ధి చేసింది. దీనిని ఈ రోజు నుండి జియో యాప్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని సూచించింది.ట్రాన్స్‌ఫార్మేషనల్ టెక్నాలజీతో తీసుకొచ్చిన జియో ఫోన్ ప్రపంచంలోనే అతి చవకైన ఫీచర్ ఫోన్. ఈ ఫోన్‌ను విడుదల చేయడం ద్వారా దేశంలోని 2జీ వినియోగదారులను జియో తనవైపు తిప్పుకున్న విషయం తెలిసిందే.కాగా ప్రస్తుతం జియో ప్రకటించి ఈ ఆఫర్ తో వినియోగదారులు సంబరపడిపోతున్నారు.
