Home / MOVIES / ప్రియా వారియ‌ర్ తండ్రి ఎవ‌రు.. బాంబేలో ఏం చేసేవాడు…?

ప్రియా వారియ‌ర్ తండ్రి ఎవ‌రు.. బాంబేలో ఏం చేసేవాడు…?

సోష‌ల్ మీడియా సెన్షేష‌న్ ప్రియా ప్రకాష్ వారియర్.. కేవ‌లం 24 గంట‌ల్లోనే ఈ కేరళకుట్టి దేశం మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది. ఒక చిన్న‌ 26 సెకన్ల వీడియోతో యావత్ దేశాన్ని మెస్మరైజ్ చేసింది. తన వెరైటి కనుచూపుల సైగలతో యువత గుండెల్లోకి దూసుకొచ్చింది. ఇక‌ ఒకేరోజు కోట్లమంది మనసులు కొల్లగొట్టి లక్షలమందిని ఫాలోవర్స్‌ని సొంతం చేసుకున్న ప్రియా బ్యాగ్రౌండ్ గురించి.. ఆమె తండ్రి గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు.

అయితే తాజాగా ఒక హిందీ న్యూస్ ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప్రియా త‌న బ్యాంగ్రౌండ్ గురించి చెప్పింది. కేరళలోని త్రిసూర్ ప్రాంతంలో జన్మించిన ప్రియా.. ప్రస్తుతం మలయాళంలో తన మొదటి సినిమాలో నటిస్తుంది. ఓమర్లులు దర్శకత్వంలో వస్తున్న ఓరు అదార్ లవ్ అనే సినిమాతో ఆమె తెరంగ్రేటం చేయనుంది.ప్రియా తండ్రిపేరు ప్రకాష్ వారియర్.. ఆయన ఓ సామాన్య ఉద్యోగి… ఆయ‌న గ‌తంలో బాంబేలో చిన్న ఉద్యోగం చేశేవారు. అప్పుడు ప్రియా ఎల్‌కేజీ చ‌దువుతోంది. ఆ త‌ర్వాత ప్రియా తండ్రికి కేర‌ళ ట్రాన్స్‌వ‌ర్ అయ్యింది. ఇక ప్రియా ప్రస్తుతం బీ.కామ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అయిన ఆ అమ్మాయి సంగీతం, నృత్యంలో కూడా మంచి ప్రావిణ్యం సంపాదించింది. ప్రియాకు ఇష్ట‌మైన హాబీస్‌లో సంగీతం మొద‌టి స్థానంలో ఉండ‌గా, ఆ త‌ర్వాత నృత్యం, ట్రావెలింగ్.. ఆమెకు ఇష్టమైన హాబీస్. ఇక ఓరు అదార్ లవ్ చిత్రంలో ఉన్న ఒక పాటలోని ఒక చిన్న సీన్ ప్రియాని రాత్రికి రాత్రే స్టార్‌ని చేసేసింది.