తెలంగాణ రాష్ట్రంలో సిద్ధిపేట జిల్లా కేంద్రం సిద్దిపేట మండలంలో వెల్కటూర్ గ్రామానికి చెందిన పుట్ట ఉమారాణి – సతీష్ లకు గత నెల జనవరిలో బాబు జన్మించాడు. పుట్టుక తోనే గుండె సంబంధిత వ్యాధి రావడం కారణంగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాదు స్టార్ ఆసుపత్రికి వెళ్లారు. గుండె ఆపరేషన్ చేస్తే కానీ పసి ప్రాణం పోసిన వారమవుతామని వైద్యులు చెప్పటంతో తల్లిదండ్రులు కంగుతిన్నారు. ఆపరేషన్ చేయించాలంటే రూ.6 లక్షలు పైగా అవుతుందని వైద్యులు సూచన మేరకు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. అసలే నిరుపేద సామాన్య కుటుంబం ..
పైగా హైదారాబాదులోని ఓ ప్రైవేట్ కంపనీలో చిరు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్న ఆ పసిపాప తండ్రికి ఆర్ధికస్తోమత కూడా లేక..” దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబమంతా శోకసంద్రంలో తల్లిడిల్లింది. ఈ విషయం మంత్రి హరీశ్ రావు దృష్టికి వచ్చిన వెంటనే స్పందించారు. వారిని పిలిపించుకోని ఆందోళన పడొద్దని తానున్నానని అండగా ఉంటానని భరోసా ఇచ్చి వారిలో మనో ధైర్యాన్ని నింపారు. ఈ క్రమంలో స్టార్ ఆసుపత్రి యాజమాన్యం, డాక్టర్ గోపి చందుతో మాట్లాడారు.” పసి బాబుకు కావాల్సిన మెరుగైన వైద్య చికిత్స చేయాలని ఎలాంటి సహాయం అయిన నేనున్నానని చెప్పారు. ఇంకా ప్రభుత్వం ద్వారా చేయూతను అందిస్తానని తెలిపారు.
ఈ నేపథ్యంలో గత నెల జనవరి 23 వ తేదీన ఆ పసి బాబుకు గుండె చికిత్స చేశారు. స్టార్ ఆసుపత్రిలోని హృదయ ఫౌండేష్ వారి సహకారంతో పాటు పసి బాబుకు వైద్యం అందించి ఆ “పసి హృదయానికి ప్రాణం పోసిన తన్నీరు జన హృదయుడయ్యారు. ఈ మేరకు సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో ఆదివారం ఉదయం పసిపాపతో ఆ తల్లిదండ్రులు మంత్రి హరీశ్ రావుని కలిశారు. వారి ఆనందాన్ని పంచుకుని బాబుకు పునర్జన్మ ఇచ్చారని జీవితాంతం ఋణపడి ఉంటామని మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.” పసి హృదయానికి ప్రాణం పోసి తన మానవత్వాన్ని చాటుకున్నారు జన హృదయుడు మంత్రి హరీష్ రావు గారు అని మరో సారి నిదర్శనం అయింది….