ఏపీ రాజకీయాల్లో వైఎస్ జగన్‌కి ఉన్నంత ప్రజాకర్షక శక్తి మరెవ్వరికీ లేదని, అంత చిన్నవయసులో ఆయనకు పోటీ రాగలిగేవారు కనిపించడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి పేర్కొన్నారు. ఓ టీవీ చానెళ్లులో కొమ్మినేని శ్రీనివాసరావు…సుబ్బరామిరెడ్డి తో నిర్వహించిన ఇంటర్వులో వైఎస్ జగన్ పై ఈ వాఖ్యలు చేశారు.
see also..జనసేన ఎంత..! దాని బతుకెంత..!! జేపీ సంచలన వ్యాఖ్యలు
ఆంద్రప్రదేశ్ లో చూస్తున్నాం కదా.. పాదయాత్రలు ఎవరు చేస్తారు ఈరోజుల్లో. ఇప్పుడలా ఎవరు నడుస్తారు. హాయిగా ఏసీ రూముల్లో కూర్చుని వచ్చిన వారితో మాట్లాడి పంపించడం ఒక పద్ధతి. ప్రజల హృదయాలను స్పర్శించడానికి జగన్ పాదయాత్ర చేస్తున్నారు. ఏది బాగుంది. ప్రజలు ఏది కావాలంటున్నారు అని తెలుసుకోవడానికి వెళుతున్నారాయన. అది చేసిన వాడే గొప్పవాడు. కాని అది అంత సులభం కాదు. జగన్ ప్రస్తుతం ఎవరు ఆపగలరు? జగన్‌కి అంత చిన్న వయసులో ఆ ప్రజాకర్షక శక్తి ఎవరికుందో చూపండి మరి. ఆ ఏజ్‌లో ఎవరు ఆయనకు పోటీ రాగలరు అని టి. సుబ్బరామిరెడ్డి అన్నారు.
see also..ఎస్సీలు గర్వపడేలా… దమ్మున్న మాటలు చెప్పిన వైఎస్ జగన్..!!