అవసరమైతే దేశ రాజకీయాల్లోకి వస్తానని నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి ఇప్పటికే దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తున్నది. బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ఇప్పటికే కేసీఆర్‌కు ఫోన్ చేసి మద్దతు ప్రకటించారు.కేసీఆర్ జీ మీ వెంటే నడుస్తాం అని మమత బెనర్జీ స్పష్టం చేశారు .ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆమె ఫోన్ లో మాట్లాడారు..కేసీఆర్ గారు మీ అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నఅని చెప్పారు.అలాగే జార్కండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కూడా మేము మీవెంటే నడుస్తాం అని మద్దతు పలికారు.అలాగే మరికొంతసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..కేసీఆర్ కోరుకుంటున్న రాజకీయ ప్రత్యామ్నయం థర్డ్ ఫ్రంట్ కు నేను మద్దతిస్తున్న అని ప్రకటించారు.ఈ సందర్భంగా హోదాకు మద్దతు తెలిపినందుకు సీ ఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
