Home / SLIDER / దేశంలోని విభిన్న రంగాల ప్రముఖులతో సీఎం కేసీఆర్ భేటీ కి ఏర్పాట్లు

దేశంలోని విభిన్న రంగాల ప్రముఖులతో సీఎం కేసీఆర్ భేటీ కి ఏర్పాట్లు

దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడం కోసం జాతీయ స్థాయిలో రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన భవిష్యత్ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన సంఘాలు, సంస్థలు, ప్రముఖులతో వరుస సమావేశాలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. మొదట ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి ఆలిండియా సర్వీస్ రిటైర్డ్ అధికారులతో సమావేశం కావాలని నిర్ణయించారు.

see also :టీడీపీ నుంచి వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసే వ్యక్తి… క్రికెట్ బెట్టింగ్ లో అరెస్ట్

జాతీయస్థాయిలోనూ, వివిధ రాష్ట్రాలలోనూ ఏళ్ల తరబడి ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం, అనేక రాజకీయ పరిణామాలను చూసిన అనుభవం ఉన్న ఆలిండియా సర్వీసు అధికారులతో సమావేశం కావడం దేశానికి కావల్సిన ఎజెండాను రూపొందించడానికి దోహదపడుతుందని సిఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఆలిండియా సర్వీస్ అధికారులతో సమావేశం తర్వాత రిటైర్డ్ రక్షణ శాఖ (సైనిక, వాయు, వైమానిక) అధికారులు, ఇతర ఉద్యోగులతో సమావేశం అవుతారు. దేశ వ్యాప్తంగా ఉన్న న్యాయ నిపుణులు, ప్రముఖ న్యాయవాదులు, అఖిల భారత రైతు సంఘాలు, వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న రైతుల సంఘాల ప్రతినిధులతో సమావేశం అవుతారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగ సంఘాలతో, మీడియా సంస్థలు, జర్నలిస్టులు, పారిశ్రామిక వేత్తలు, కార్మిక సంఘాల ప్రతినిధులతోనూ సమావేశ కావడానికి సిఎం సన్నాహాలు చేస్తున్నారు.

see also :ప్ర‌త్యేక హోదా బ్రాండ్ అంబాసిడ‌ర్‌..??

ఈ సమావేశాలు హైదరాబాద్, న్యూ ఢిల్లీలో పాటు కలకత్తా, ముంబై, చెన్నై, బెంగుళూరు లాంటి నగరాల్లో కూడా నిర్వహించాలని సిఎం నిర్ణయించారు. వివిధ వర్గాల ప్రతినిధులతో వరుస సమావేశాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఆయా వర్గాలను సంప్రదించడానికి, సమన్వయం చేయడానికి ప్రత్యేకంగా సమన్వయకర్తలను కూడా ముఖ్యమంత్రి నియమించారు.
దేశం బాగుపడాలని, దేశ ప్రజలు బాగుండాలని ఆలోచించే ప్రతి ఒక్క వర్గంతో మాట్లాడడం ద్వార ఈ దేశానికి అవసరమైన ఎజెండాను రూపొందించ వచ్చని సిఎం భావిస్తున్నారు.

see also : డిల్లీ గద్దె మీద కూర్చోగల సత్తా ఉన్నలీడర్ కేసీఆర్..కత్తి మహేష

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat