తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరో మందడుగు వేశారు. తెలంగాణను లైప్ సైన్సెస్ రంగంలో మరింత ముందుకు తీసుకుపోయేందుకు కీలక సమావేశం నిర్వహించారు. రానున్న ఈ రంగంలో విజన్ 2030 పేరుతో ఒక ప్రణాళికను రూపొందిస్తున్నట్లు అయన తెలిపారు. ఈరోజు తెలంగాణ లైప్ సైన్సెస్ అడ్వయిజరీ కమీటీతో హైదరాబాద్ లోని నోవాటెల్ లో సమావేశం అయ్యారు. ఈ మేరకు కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ర్టానికి ఈ రంగంలో ఉన్న అవకాశాలు, అభివృద్దిపైన మంత్రికి వివరాలు అందించారు. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఇక్కడి మౌళికవసతులు పరిశ్రమకు మరింత వృద్దిని అందిస్తాయని, ఈ నేపథ్యంలో పరిశ్రమ కోసం ఉండాల్సిన విజన్ పైన మంత్రితో చర్చించారు. లైప్ సైన్సెస్ రంగంలో మరింత వృద్ది సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన మంత్రితో చర్చించారు.
see also :సీఎం కేసీఆర్ కు మద్దతు ఇవ్వండి..మంత్రి తుమ్మల
తెలంగాణ ప్రభుత్వం ఫార్మారంగాన్ని ఒక ప్రాధాన్యత రంగంగా ఏంచుకుని, పరిశ్రమ అభివృద్దికి అనే ప్రణాళిలు రచిస్తున్నదని మంత్రి కేటీఆర్ వారికి తెలిపారు. ముఖ్యంగా ఈ అంశంలో హైదరాబాద్ ఫార్మసిటీ ఒక మైలు రాయిగా నిలుస్తుందని తెలిపారు. ఈనెలతో నిర్వహించిన బయో ఏషియా సదస్సులో రాష్ర్ట లైప్ సైన్సెస్ రంగాన్ని ఏలా అభివృద్ది పరచాలనే అంశంపైన జరిగిన చర్చలు, సలహాల మేరకు ఈ రోజు ఈ సమావేశం చర్చించినట్లు తెలిపారు. రానున్న సంవత్సరాల్లో తెలంగాణ లైప్ సైన్సెస్ తన స్ధానాన్ని సుస్ధిరం చేసుకోవడంతోపాటు అంతర్జాతీయ కంపెనీలను ఇక్కడికి వచ్చేలా చూస్తామన్నారు. దీంతోపాటు లైప్ సైన్సెస్ రంగంలో వస్తున్న డిజిటల్ మెడిసిన్, ఫుర్మరంగంలో అర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వంటి వాటి ద్వారా రానున్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవసరం అయిన చర్యలను తీసుకుంటామని, హైదరాబాద్ లైప్ సైన్సెస్ ఈకో సిస్టమ్‌ను మరింతగా అభివృద్ది చేస్తామని మంత్రి తెలిపారు. ఇందుకోసం పరిశోధన, శిక్షణ వంటి అంశాల్లో ప్రభుత్వం మరింత చురుగ్గా పనిచేస్తుందన్నారు.
see also :హరీష్ బాల్కొండకొస్తే చంపేస్తాం-తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత ..
లైప్ సైన్సెస్ రంగంలోని పరిశోధనలకు ఊతం ఇచ్చేందుకు టి హాబ్ లాంటి ఒక ఇంక్యూబేటర్ ను జినోమ్ వ్యాలీలో ఏర్పాటు చేస్తామన్నారు. ఐదు వ్యాదులను ఏంచుకుని వాటిని కట్టడి చేయడం కోసం అవసరం అయిన పరిశోధనలకు ప్రాధ్యాన్యత ఇస్తామన్నారు. ఫార్మ కంపెనీలు, విద్యాసంస్ధలు, సిసియంబి వంటి పరిశోధన సంస్దల మద్య మరింత పరిశోధనల సమన్వయాన్ని పెంచేందుకు రిచ్(RICH) ప్రయత్నిస్తుందన్నారు. ఫార్మ, లైప్ సైన్సెస్ రంగంలో పరిశోధనలు చేసే స్టార్ట్ అప్స్, హైరిస్క్ రిసెర్చ్ కు ప్రొత్సాహాం అందించేందుకు ఒక ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం రానున్న బడ్జెట్ లో కేటాయింపులు చేయాలని ప్రభుత్వానికి విజ్ఝప్తి చేయనున్నట్లు మంత్రి అడ్వయిజరీ కమీటీకి తెలిపారు. లైప్ సైన్సెస్ రంగంలోని కంపెనీల భాగస్వామ్యంతో పాఠశాల స్దాయి నుంచే కెరీర్ కౌన్సిలింగ్ కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు.
see also :జగన్ కు పిచ్చెక్కింది..అందుకే రోడ్లపై తిరుగుతున్నాడు-టీడీపీ మాజీ ఎమ్మెల్యే..!
నూతన పరిశ్రమలను తెలంగాణకు రప్పించడంతో పాటు ఇప్పటికే ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న పరిశ్రమల విస్తరణపైన దృష్టి సారిస్తుందన్నారు. ఈ మేరకు త్వరలోనే ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి పరిశ్రమ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఫార్మరంగంలో మరిన్ని పెట్టుబడులు వచ్చేలా ప్రభుత్వం ఒక ఇన్వేస్ట్ మెంట్ ప్రమోషన్ బాడీని ఏర్పాటు చేస్తుందని మంత్రి తెలిపారు.