రాష్ట్ర మహిళలకు ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి వారికి ఆసరా పెన్షన్ ఇచ్చే వరకు ప్రతి స్థాయిలో చేయూతనిస్తూ వారి సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడుతోందన్నారు. గర్భిణీ మహిళలకు ప్రసవానికి ముందు మూడు నెలలు, ప్రసవం తర్వాత మరో మూడు నెలలు పని చేయకుండా ఉండేందుకు నెలకు 2వేల రూపాయల చొప్పున మొత్తంగా 6 నెలలు 12వేల రూపాయలు, ఆడపిల్ల పుడితే వెయ్యి రూపాయలు అదనంగా కలిపి 13 వేలు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు.
see also :నేను రెడీ….మీరు రెడీనా..? వైఎస్ జగన్
మహిళలకు ప్రభుత్వ దవాఖాన లో సురక్షిత ప్రసవం కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశామని, ప్రసవం అనంతరం తల్లికి, బిడ్డకు కావాల్సిన వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్ ఇస్తున్న ఏకైక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అన్నారు.బాలికల విద్యను ప్రోత్సహించడంలో భాగంగా భారీ ఎత్తున గురుకులాలు ఏర్పాటు చేశామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ,ఎస్టీ,బీసీ మహిళల డ్రాప్ అవుట్స్ ఉండొద్దని 53 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. బాలికల కోసం ప్రత్యేకంగా నడిపే కేజీబీవిలను దేశంలో అన్ని రాష్ట్రాల కంటే గొప్పగా నిర్వహిస్తున్నామన్నారు. మహిళల విదేశీ విద్యకు 20 లక్షల రూపాయల స్కాలర్ షిప్ ఇస్తున్నామన్నారు.
see also :బుల్లితెర బ్రేకింగ్: అంగరంగ వైభవంగా రష్మీ, సుధీర్‌ల వివాహం..!!
పేదింటి ఆడపిల్ల పెళ్ళికి కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పేరుతో 75,116 రూపాయలు ఇస్తున్నామని, మహిళా బీడీ కార్మికులకు పెన్షన్, వితంతువులు,వికలాంగ మహిళకు పింఛన్ ఇస్తూ ఆదుకుంటున్న ప్రభుత్వం ఇది అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, ఇళ్ల పట్టాలు, సంక్షేమ కార్యక్రమాలు మహిళల పేరు మీద చేస్తూ మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. మహిళలు రోడ్డు ఎక్కి నీళ్లకోసం నిలబడే పరిస్థితి ఉండొద్దని మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చే గొప్ప కార్యక్రమం చేస్తున్న ఈ ప్రభుత్వానికి మహిళలు అండగా ఉండాలని ఆకాంక్షించారు.
see also :అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి రాజీనామా..ప్రధానమంత్రికి సమర్పణ
మహిళలు ఇష్టంగా, పవిత్రంగా భావించే బతుకమ్మ పండుగను రాష్ట్ర పండగ గా ప్రకటించి వారికిస్తున్న ప్రాధాన్యతను తెలియజేశామన్నారు. తెలంగాణ పేరును ప్రపంచంలో నిలబెడుతున్న క్రీడాకారిణి లకు పెద్ద ఎత్తున ప్రోత్సాహమిస్తూ..వారిని బ్రాండ్ అంబాసిడర్స్ చేసిన ప్రభుత్వం తెలంగాణ అని గుర్తు చేశారు. మహిళా భద్రతకు పెద్ద పీట వేస్తూ షీ టీమ్స్ ఏర్పాటు చేసి, డ్రోన్స్ ద్వారా వారికి భద్రత హామీనిస్తూ మహిళల పట్ల అత్యంత శ్రద్ధ చూపుతున్న ప్రభుత్వమన్నారు. మహిళలు ఈ మహిళా దినోత్సవాన్ని గొప్పగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మరోసారి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.