తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టీ-హబ్‌తో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని ఆర్జిస్తున్న తెలంగాణ రాష్ట్రం మరో వినూత్న పథకానికి సిద్ధమైంది. స్టార్ట్‌పలను ప్రోత్సహించేందుకు ఇప్పటికే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంప్‌సలో ఏర్పాటుచేసిన టీ-హబ్ తరహాలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేకంగా వీ-హబ్(విమెన్ ఆంత్రప్రెన్యూర్ హబ్)ను అందుబాటులోకి తేనుంది.
see also :ఆంధ్రజ్యోతికి వైఎస్ జగన్ వార్నింగ్..మరోకసారి..!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ దీనిని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. గతేడాది హైదరాబాద్‌లో జీఈఎస్ సదస్సులో భాగంగా ‘‘మహిళలే ప్రథమం.. అందరికీ శ్రేయస్సు’’ ప్రధానాంశంగా జరిగిన కార్యక్రమంలో 170 దేశాల నుంచి 1500 మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.