ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు.ఈ సోమవారం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకుండా రాష్ట్రంలో అమరావతిలో శాసనసభ సమావేశాలకు వచ్చారు.
See Also:చంద్రబాబు రూ.3 లక్షలా 30 వేల కోట్ల అవినీతిని ఏకిపారేసిన మాజీ కేంద్రమంత్రి..!!
ఈ క్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఎదురుపడ్డారు.ఈ నేపథ్యంలో చంద్రబాబు జేసీ ను ఉద్దేశించి మీరు బడి ఎందుకు ఎగొట్టారు .ఇలా అయితే ఫెయిల్ అవ్వడం ఖాయం అని చంద్రబాబు అన్నారు.దీనికి సమాధానంగా జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ తను ఎప్పుడు ఫెయిల్ కానని సమాధానమిచ్చారు .