వేసవి వచ్చిందంటే చాలు ఉక్కపోత..చుట్టూ ఏసీ ఉన్న కానీ పై నుండి కింద దాకా కారిపోయే చెమటలు ..దానివలన వచ్చే చిరాకు.ఇక బయటకు వెళ్ళేటప్పుడు అయితే చెప్పనక్కర్లేదు.పైన ఎండా కింద నుండి వచ్చే ఆవిరి ఇలా ఎలా చూసిన కానీ ఎండాకాలంలో ఉక్కపోతతో చచ్చిపోతాం .ఇలాంటి బాధలను తప్పించడానికే మొబైల్ సహాయంతో నడిచే ఫ్యాన్లను తయారుచేశారు.ఇది కేవలం రెండు రెక్కలతో ఉన్న ఈ ఫ్యాన్ మొబైల్ లో పెట్టుకునే ఛార్జింగ్ పెట్టె పోర్టుకు పెడితే చాలు .అది తిరిగి చల్లగా గాలి వస్తుంది.అయితే దీని ధర కూడా చాలా తక్కువ .ఎంత అంటే కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే ..ఈ రకమైన ఫ్యాన్ ఆన్లైన్ వెబ్ సైట్స్ అయిన మినీ ఇన్ ది బాక్స్ వెబ్సైట్లో, అమెజాన్లో ఇవి అందుబాటులో ఉన్నాయి.
