దేశంలోనే అత్యంత యువ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై పెట్టినవన్నిఅక్రమకేసులే అని తెలుస్తుంది. అనాడు టీడీపీ పార్టీ కి చెందిన మాజీ ఎమ్మెల్యే శంకర్రావు ,దివంగత మాజీ ఎంపీ ఎర్రన్నాయుడు వైఎస్ జగన్ పై అక్రమ కేసులు పెట్టిన సంగతి తెల్సిందే. అప్పటి నుండి ఇప్పటి వరకు అవీనితిపరుడు అనడమే గాని ఒక్కటంటే ఒక్కదానిలో కూడ రుజువు కాలేదు. ఇక ముందు కూడ వైఎస్ జగన్ పై ఉన్న అన్ని కేసులు ఉత్తివే అని తేలబోతుంది. ఎందుకంటే బుదవారం సాక్షి మరియు అరబిందో ఆస్తుల కేసులో ట్రిబ్యునల్ తుది తీర్పు వెలువరించింది . కేసుని కొట్టివేస్తూ అక్రమంగా ఆస్తులు అటాచ్లు చేశారని ఈడీని ట్రిబ్యునల్ తీవ్రంగా తప్పుపట్టింది .
- ఎవరైనా 21 కోట్లు లాభం కోసం 29 కోట్లు పెట్టుబడులు పెడతారా ? అసలు మీరు చేసిన ఈ ఆరోపణని ఎలా సమర్ధించుకొంటారు ?
- జగన్ , సాయిరెడ్డి లు ఇన్వెస్టర్లని మోసం చేసి పెట్టుబడులు పెట్టించారని ఈడీ ఆరోపణ ..
- ఒకవేళ ఇదే ఆరోపణ నిజమనుకొంటే ఆ ఇన్వెస్టర్లు కేసులు పెట్టాలి కానీ ఎలాంటి కంప్లైంట్ లేకుండా మీరు కేసు పెట్టటం ఏమిటి ?
- కనీసం ఆ ఇన్వెస్టర్లు మేము మోసపోయామని మిమ్మల్ని సంప్రదించారా ?
- సాక్షిలో 60 మంది పెట్టుబడులు పెడితే కేవలం కొంతమందిని మాత్రమే కేసుల్లో ఎందుకు పెట్టారు ?
- అసలు కేసులతో సంభంధం లేని ఆస్తులని అటాచ్ చేయటం ఏమిటి ?
- సాక్షిలో పెట్టుబడులు పెట్టి మోసపోయామని కానీ లేదా నష్టపోయామని కానీ లేదా బలవంతంగా పెట్టుబడులు పెట్టించారని కానీ మీకు ఎవరైనా ఫిర్యాదు చేశారా ?ఇవీ ముఖ్యంగా ఈడీని ట్రిబ్యునల్ అడిగిన ప్రశ్నలు . వీటిలో ఏ ఒక్కదానికి ఈడీ సమాధానం చెప్పలేదు . సరైన ఆధారాలు లేవు ,అసలు ఈ కేసులన్నీ అక్రమంగా పెట్టినట్లు కనిపిస్తుందని , అసలు వీటిలో ఈడీ బాధ్యతారాహిత్యం కనిపిస్తుందని తీవ్రంగా వ్యాఖ్యానిస్తూ కేసు కొట్టివేసింది . ఏదిఏమైనా బుదవారం తీర్పులో తేలేదేమిటంటే అసలు వైఎస్ జగన్ మీద పెట్టిన ఏ కేసు నిలవదు , అన్నీ ఈ కేడీ జేడీ పెట్టిన అక్రమకేసులే అని తెలుస్తుంది .అతి త్వరలోనే కేసులన్ని కొట్టివేయ్యడం జరుగుతుందని వైసీపీ అభిమానులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో ఆనందంతో 2019 ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ హల్ చల్ చేస్తున్నారు.