ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ అగ్ర దర్శకుడు రాఘవేంద్రరావు భేటీ అయ్యారు.ప్రస్తుతం రాఘవేంద్రరావు టీటీడీ బోర్డులో సభ్యుడిగా ఉన్న సంగతి తెల్సిందే.
అయితే రాఘవేంద్రరావును టీటీడీ బోర్డు చైర్మన్ గా నియమించనున్నారు అని వార్తలు వస్తున్నా నేపథ్యంలో వీరిద్దరి కలయిక ప్రస్తుతం ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా ఉంది.అయితే ఎప్పటి నుండో రాఘవేంద్రరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో టీడీపీ పార్టీతో సన్నిహిత సంబంధాలను కల్గి ఉంటున్న సంగతి తెల్సిందే .ఎప్పటి నుండో టీడీపీ పార్టీకి చెందిన అన్ని రకాల లఘు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహిస్తూ వస్తున్నారు..