ఏపీలో ప్రస్తుత రాజకీయ సమీకరణలు రాకెట్ వేగం కంటే స్పీడ్ గా మారిపోతున్నాయి.ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో కూడా క్లారిటీ లేకుండా రాజకీయ వర్గాల అంచనాలకు కూడా అందకుండా తయారవుతున్నాయి.ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీకి అత్యంత పట్టున్న జిల్లాలలో ఒకటి కృష్ణా జిల్లా ..అట్లాంటి కృష్ణా జిల్లాలో అధికార పార్టీకి బిగ్ షాక్
తగలనున్నది.అందులో భాగంగా జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత ,మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు అయిన వసంత కృష్ణప్రసాద్ టీడీపీ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరడానికి ప్లాన్ చేస్తున్నారు.
See Also:నడి రోడ్డు మీద శ్రీరెడ్డి చేసిన పనికి ..విప్పేసి మరి ..!
ప్రస్తుతం అధికార టీడీపీ పార్టీకి ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్న ..అధికారంలో లేకపోయిన సరే తొమ్మిది ఏళ్ళు పార్టీకి సేవలు చేసిన తగిన గుర్తింపునివ్వకుండా ఇతర పార్టీల నుండి చేరినవారికి పెత్తనం ఇస్తూ కింది స్థాయి నుండి జిల్లా స్థాయి నేతలవరకు అందర్నీ సదరు పార్టీ మారిన నేతల చేతుల్లో పలు అవమానాలకు గురిచేస్తుండటంతో సహించని మాజీ మంత్రి తనయుడు పార్టీ మారాలని తన అనుచవర్గం సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు అని బాహాటంగా జిల్లా టీడీపీ వర్గాల్లోనే చర్చించుకుంటున్నారు.
See Also:తెరపైకి డ్రగ్స్ కేసు-స్టార్ హీరో ,స్టార్ దర్శకుడిపై కేసు నమోదు ..!
అందులో భాగంగా జిల్లాలో కొన్ని నియోజక వర్గాల్లో కింది స్థాయి క్యాడర్ నుండి నియోజక వర్గ ఇంచార్జ్ లవరకు అందరూ వసంత బాటలో నడవటానికి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారు.అందుకే కృష్ణప్రసాద్ వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయ్యారు అని కూడా సమాచారం.ఇందుకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వచ్చే వారంలో జిల్లాలో జరగనున్న జగన్ ప్రజాసంకల్ప యాత్రలో కృష్ణప్రసాద్ తన అనుచరులతో ,టీడీపీ నేతలతో భారీ స్థాయిలో వైసీపీ గూటికి చేరనున్నారు.అయితే జిల్లాలో వసంత కుటుంబానికి మంచి పేరుండటం ..కింది స్థాయి నుండి పై స్థాయి వరకు టీడీపీ నేతల ,కార్యకర్తల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత నిరాశ నిస్పృహ తదితర అంశాలు వీర్ని పార్టీ మారడానికి ప్రధాన కారణమని తెలుగు తమ్ముళ్ళు స్వయంగా చెబుతున్నారు .