శ్రీమంతుడు తరువాత ప్రిన్స్ మహేష్ బాబు తో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం భరత్ అనే నేను.ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలు హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ స్టేడియం లో నిన్న ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ హాజరై థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు.ఈ ట్రైలర్ లో ప్రిన్స్ సీ ఎం గా కనిపిచడంతో మరియు ఆయన నోటి నుండి వచ్చిన డైలాగ్స్‌కి స్టేడియం మొత్తం దద్దరిల్లింది. ‘ఎట్టకేలకు ఒక్కడొచ్చాడు. రాజకీయ నాయకుడు అనుకున్నా.. నాయకుడు’ అంటూ రావు రమేష్ పలికే డైలాగ్ ఆకట్టుకుంది. ‘తప్పు జరిగితే కొంచెం కఠినంగా ఉండి దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తే, నీకు రాచరికం, రాజులూ గుర్తొచ్చారు. కానీ, నాకు మాత్రం చిన్నప్పుడు తప్పు చేస్తే దండించిన మా అమ్మా, నాన్న గుర్తొచ్చారు’ అంటూ మహేష్ వాయిస్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. చివరలో త్వరలోనే మీ అందరినీ మాట మీద నిలబడే మగాళ్లను చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నా.. అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. కాగా ఈ నెల 20 న ఈ చిత్రం విడుదల కానుంది.
