ఏపీ అధికార టీడీపీ పార్టీలో అప్పుడే వర్గ పోరు మొదలైంది .మరో ఏడాదిలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలుగు తమ్ముళ్ళు ఇప్పటి నుండే కుమ్ములాటలాడుకుంటున్నారు.ఈ క్రమంలో రాష్ట్రంలో ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రత్తిపాడు నియోజక వర్గ టీడీపీ పార్టీలో ఎప్పటి నుండో విభేదాలు తీవ్రరూపం దాల్చాయి.అసలు విషయానికి వస్తే నియోజక వర్గంలో టీడీపీ సర్కారు ఎంతో అట్టహాసంగా చేపడుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఈ విభేదాలు బయటకు వచ్చాయి.పెన్షన్లు పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ,దివంగత మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు ఫోటోలను మొదట వేశారు.
ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే వర్గీయులకు ఇది నచ్చలేదు .అంతే వెంటనే అప్పటికప్పుడు ఫ్లేక్సీలు మార్చలేరు కాబట్టి ఆ రెండు బొమ్మలు ఉన్న ప్లేసులో స్టికర్లు (అదే మాస్కులు)వేశారు .అంతే దివంగత మాజీ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు వర్గీయులు ఇది అంతా స్థానిక ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు కావాలనే ఇలా చేయిస్తున్నారు ..ఆయన ఎప్పటి నుండో పార్టీ మారడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు .
అందుకే ఇలా తమ అభిమాన నేతలను అవమానిస్తున్నారు అని యుద్ధానికి దిగారు.అంతే సదరు వర్గీయులు మీరే పొమ్మనలేక పోగబెడుతున్నారు.మేము ఏమి కావాలని చేయలేదు .అయిన మీరు మా ముందు ఎంత అంటూ యుద్ధానికి దిగారు .దీంతో కాసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.అయితే సదరు ఎమ్మెల్యే వైసీపీ నుండి టీడీపీలో చేరిన తనను అనేక అవమానాలకు గురి చేస్తుండటంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన తిరిగి వైసీపీ పార్టీలో చేరతారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే .చూడాలి మరి ప్రస్తుతం పోమ్మనలేక పొగ బెడుతున్న తెలుగు
తమ్ముళ్ళను తట్టుకుంటారో చూడాలి.