టాలీవుడ్ స్టార్ హీరో ,సూపర్ స్టార్ మహేష్ బాబు తన పొలిటికల్ ఎంట్రీ మీద క్లారిటీ ఇచ్చారు.మహేష్ బాబు హీరోగా నేటి రాజకీయాలను ఆధారంగా తీసుకొని తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “భరత్ అనే నేను “.ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించగా దానయ్య డీవీవీ నిర్మాతగా వ్యహరించారు .
ఈ నేపథ్యంలో దర్శకుడు శివతో కల్సి మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ తనకు వందేళ్ళు వచ్చేవరకు సినిమాల్లోనే నటిస్తాను.కానీ రాజకీయాల్లోకి రాను అని తెలిపారు.ఆయన ఇంకా మాట్లాడుతూ తానూ విజయవాడ రావడం చాలా ఆనందంగా ఉంది.నేను ఇక్కడకి రావడాన్ని సెంటిమెంట్ గా భావిస్తాను అని ఆయన తెలిపారు .