తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ,నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తన పెద్దమనసును చాటుకున్నారు. నిజామాబాద్ జిల్ల బోధన్ మండలం ఊట్‌పల్లికి గ్రామానికి చెందిన జ్యోతి అనే అభాగ్యురాలికి కొత్త జీవితం ప్రసాదించారు. అరుదైన ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్న జ్యోతి నాలుగు లక్షల రూపాయలు స్వంత ఖర్చులతో ఆపరేషన్ చేయించారు. ప్రాణాంతకమైన ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్ జ్యోతి పరిస్థితిని ఆమె సోదరుడు ట్విట్టర్ ద్వారా ఎంపీ కవితకు మొరపెట్టుకున్నాడు. దీంతో వెంటనే చలించిన ఎంపీ కవిత సికింద్రాబాద్‌లోని సన్‌షైన్ ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి జ్యోతికి ఆపరేషన్ చేయించారు. ఆపరేషన్ సక్సెస్ అయిందని డాక్టర్లు తెలిపారు.ఈ సందర్భంగా వారి ఎంపీ కవితకు ధన్యవాదాలు తెలిపారు..
— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 9, 2018
@RaoKavitha H'ble madam gaaru,
surgery cmpltd. With all ur efforts, support & care my sister #JP_Jyothi is now getting cured from Abdominal Pain. Madam ji #ur_help_is_much_appriciated we thanking u so much for taking care. #ur_help_is_priceless &#spl_thanks_to_ur_entire_staff. pic.twitter.com/N735xxyKBt— Vijay Diyavath (@VijaymaalyaD) May 9, 2018