ఏపీలో ప్రస్తుతం వైసీపీలోకి భారీగా చేరికలు మొదలయ్యాయి. టీడీపీ పాలన నచ్చక ..చేసే పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత రావడంతో అన్ని పార్టీల నాయకులు బలంగా ఉన్న ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి చేరుతున్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీదే విజయం అని తెలుసుకోని మరి వలసలు వస్తునారంట. ఇప్పటికే కృష్ణా జిల్లా నుంచి యలమంచిలి రవి, వసంత కృష్ణప్రసాద్ లు ఆ పార్టీలో చేరారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి, దివంగతనేత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుటుంబం వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంది. బుధవారం జనార్ధనరెడ్డి నాల్గవ వర్ధంతి సందర్బంగా అయన కుమారుడు రాంకుమార్ రెడ్డి పలు సేవ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్బంగా దాదాపు 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యకర్తల మీటింగులో నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి మాట్లాడారు. తన తండ్రి జనార్ధనరెడ్డి ఈ జిల్లాకు ఎంతో మేలు చేశారని గుర్తు చేశారు.తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకోవడంలో తమకు కాస్త ఆలస్యమైందన్నారు. ఇకపై రాజకీయాల్లోనే ఉంటానన్నారు. అంతేకాకుండా నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఏ పార్టీలో చేరేది ఆగస్టులో వెల్లడిస్తానని చెప్తున్న సమయంలో అభిమానుల నుంచి వైసీపీలో చేరాలని కేకలు వినిపించాయి.. దానికి సమాధానం చెప్పిన రాంకుమార్ రెడ్డి మీకున్న కొరికే తనకు ఉందని అయితే మూడు నెలలు ఓపిక పట్టాలని సూచించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటికే వైసీపీ అగ్రనేతలు వైసీపీలోకి రావాలని నేదురుమల్లి కుటుంబాన్ని కోరినట్టు తెలుస్తోంది. ఇకపోతే ఏపీలో వైసీపీ కంచుకోట అయిన నెల్లూరు జిల్లాలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుటుంబం వైసీపీలో చేరితే వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయడం ఎవరు ఆపలేరు అంటున్నారు వైసీపీ అభిమానులు.