ఏపీలో అప్పుడే ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది అందుకే అధికార టీడీపీ పార్టీలో ఆధిపత్య హోరు మొదలైంది .అందులో భాగంగా రానున్న ఎన్నికల్లో తమకు ఎక్కడ బరిలోకి దిగటానికి అవకాశం ఉండదేమో అని తెలుగు తమ్ముళ్లు తమ రాజకీయ భవిష్యత్తు కోసం పక్క ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు .
అందులో భాగంగా గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున నిలబడి తనపై గెలుపొంది ఇప్పుడు పార్టీలో చేరి మంత్రి గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆదినారాయణ రెడ్డి పై టీడీపీ సీనియర్ నేత రామసుబ్బారెడ్డి ఫైర్ అయ్యారు .అందులో భాగంగా మంత్రి ఆదినారాయణ రెడ్డి కంటే ముందుగా టీడీపీ పార్టీ మినీ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు .
అయితే సాక్షాత్తు మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డిని పిలవకుండా ఏకంగా తానే స్వయంగా మినీ మహానాడు నిర్వహించి తన సత్తా చూపించి రానున్న ఎన్నికల్లో జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుండి సీటు ఖాయం చేసుకోవాలని ఇలా చేసి మంత్రి ఆదినారాయణ రెడ్డికి బిగ్ షాకిచ్చారు ..