టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో ,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే ఒకరు చేరనున్నారు వార్తలు వస్తున్నాయి .రాష్ట్రంలోని ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాలా జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకోవడానికి రంగం సిద్ధంచేసుకుంటున్నారు అని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి .
అయితే పోరాట యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజులు పాటు జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా నరేష్ కుమార్ కు సంబంధించిన అనుచరులు ,పవన్ కళ్యాణ్ సన్నిహితుల మధ్య చర్చలు జరిగాయి .అందులో భాగంగా పార్టీలో చేరడానికి పవన్ కళ్యాణ్ నుండి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని చెబుతున్నారు .వచ్చే నెలలో నరేష్ కుమార్ జనసేన గూటికి చేరనున్నారు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నారు ..