Home / NATIONAL / పెట్రోల్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ ..!

పెట్రోల్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్ ..!

మీకు కారు ఉందా ..!పోనీ మీకు బైకుందా ..ఉంటె అది పెట్రోల్ తో నడుస్తుందా ..!.మీకు తెలివి ఉందా ..బైకుంటే పెట్రోల్ తో కాకుండా నీళ్ళతో నడుస్తుందా అని మమ్మల్ని తిట్టుకుంటున్నారా ..అయితే ఆగండి ఆగండి మేము చెప్పే వార్తను చదివితే మమ్మల్ని తిట్టుకోవడం కాదు .మిమ్మల్ని మీరే తిట్టుకుంటారు .

అసలు ముచ్చట ఏమిటి అంటే గత నాలుగు ఏండ్లుగా రోజు రోజుకి పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న సంగతి తెల్సిందే .అయితే తాజాగా ఇప్పటికే తెలంగాణ ,ఏపీ రాష్ట్రాల్లో ఎనబై రూపాయలుండగా దేశంలోని మిగత నగరాల్లో అటు ఇటుగా ఎనబైకి దగ్గర ఉంది .అయితే రానున్న రోజులో పెట్రోల్ ధరలు పెరిగి ఏకంగా ఎనబై కాదు తొంబై కాదు వంద రూపాయలకు పైగా పెట్రోల్ ధర పెరుగుందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు .

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వారం పదిరోజుల్లో పెట్రోల్ ధర వందకు పెరగడమే కాకుండా అదే ధర వద్ద పెరుగుతూ మధ్యతరగతి సామాన్య ప్రజలు మరింత ఇబ్బందులు పడే రోజులు వస్తాయి అని వారు అంటున్నారు .ఇలా వారు చెప్పినట్లు జరిగితే ఒక ముప్పై ఇరవై యేండ్ల కిందట వెళ్ళినట్లు కార్లు ,బైకులు వదిలేసి సైకిల్స్ ,ఎడ్ల బండ్ల మీద పోవాల్సి వస్తుందేమో అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు ..