ఏపీలోని టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దిక్షీతులుపై ఏపీ మంత్రి ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ముఖ్య అనుచరుడు ,ఆ పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు ..ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్తానం మాజీ ప్రదాన అర్చకుడు రమణ దీక్షితులును బొక్కలో తోసి నాలుగు తగిలించాలని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ఎవరా రమణ దీక్షితులు..ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే అంత భయం లేదా? బాబు గారి గురించి ఏమి మాట్లాడతారు. హద్దుమీరి మాట్లాడుతున్నారు. వెంకటేశ్వరస్వామి దగ్గర ఏమి చేశాడో అన్ని నిజాలు,వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండి ఏమి చేశాడో అన్నీ బయటకువ స్తాయని ,బొక్కలో వేసి నాలుగు తగిలిస్తే ..అని అన్నారు. టీటీడీ అంశాన్ని బజారుకు ఎక్కిస్తారా? ?భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆయన అన్నారు.