గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి..ప్రముఖ సినీ నటుడు ,నిర్మాత , ‘రెడ్ స్టార్’ మాదాల రంగారావు(70) ఈ రోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారు జామున మాదాల కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే మాదాల రంగారావు మృతి పట్ల వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. నటుడి కుటుంబసభ్యులకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.కాగా మాదాల స్వగ్రామం ప్రకాశం జిల్లా మైనం పాడు .1948 మే 25న ఆయన జన్మించారు.
