సూపర్ స్టార్ రజనీ కాంత్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ కాలా .ప్రస్తుతం ఈ మూవీ విడుదల కోసం ఒక్క భారతదేశంలోనే కాదు ఏకంగా ప్రపంచం అంతటా ఎంతో ఉత్సకతతో ఎదురుచూస్తున్నారు అంటే అతిశయోక్తి కాదేమో ..అంతగా ఆయనకు అభిమానులున్నారు .అయితే ప్రస్తుతం రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్న సంగతి కూడా తెల్సిందే .
ఈ క్రమంలో కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మధ్య ఉన్న ప్రధాన సమస్య కావేరి జలాల వివాదం .ఈ వివాదంపై సూపర్ స్టార్ తమిళ ప్రజల తరపున మాట్లాడిన సంగతి తెల్సిందే.అంతే కాకుండా తమిళ ప్రజలు చేసిన ధర్నాకు మద్దతుగా కూడా ఆయన పాల్గొన్నారు .
దీంతో కర్ణాటక రాష్ట్రంలో కాలా మూవీ విడుదల చేయడానికి మేము ఒప్పుకోము అని కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గోవిందుడు ప్రకటించాడు .కన్నడ సంఘాల నుండి విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు .మరి బ్యాడ్ న్యూస్ కదా మరి సూపర్ స్టార్ అభిమానులకు ..