తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.కరీంనగర్ జిల్లా మానకొండురు మండలం చెంజర్ల వద్ద వరంగల్ నుండి కరీంనగర్ వస్తున్న హుజురాబాద్ డిపో బస్సును, వరంగల్ వైపు వెళ్తున్న రాజస్థాన్ కి చెందిన లారీని బలంగా ఢీకొట్టింది. వేరే వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయిన లారీ ఎదురుగా వస్తున్న బస్సును డ్రైవర్ సీటు వెనక నుండి చివరి వరకు చీల్చుకుంటూ వెళ్ళడం తో బస్ లో ఉన్న వారి కాళ్ళు చేతులు తలలు చీలి పోయాయి. ప్రమాదం జరిగినదని తెలిసిన వెంటనే ఉన్న కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారందరినీ హాస్పిటల్స్ కి తరలించారు మంత్రి ఈటల రాజేందర్.
ఈ సందర్భంగా అయన ఘటనా స్థలం భయానక వాతావరణం తలపించిదని అన్నారు. బస్సును లారీ నీ పరిశీలించిన మంత్రి.. ప్రమాదం జరిగిన తీరును అడిగితెలుసుకున్నారు. అక్కడినుండి నేరుగా కరీంనగర్ సివిల్ హాస్పిటల్ కి చేరుకున్న మంత్రి.. గాయపడిన వారిని పరామర్శించారు. ఆతరువాత అపోలో రీచ్ హాస్పిటల్ లో ఉన్నవారిని కూడా పరామర్శించి, అక్కడే ఉన్న కండక్టర్ నీ అడిగి ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు. హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న వారందరికీ మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని డాక్టర్స్ ని కోరారు. అవసరం అయితే హైదరాబాద్ తరలించాలని కోరారు. గాయపడిన వారందరికీ ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యసేవలు అందిస్తామని సీఎం గారు హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.
మొత్తం 51 మంది బస్ లో ఉండగా 6 గురు అక్కడికక్కడే చనిపోయారు, ఒక్కరు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయారు.చనిపోయిన వారికి 5 లక్షల రూపాయలు ప్రకటించారు. అన్ని మృతదేహాలకు పోస్ట్ మార్టం పూర్తి అయ్యేవరకు సివిల్ హాస్పిటల్ లోని పోస్టుమార్టం రూం దగ్గరే ఉన్నారు మంత్రి ఈటల. అన్ని మృతదేహాలు దగ్గర ఉండి అంబులెన్స్ లో వాళ్ళ ఇళ్లకు పంపించారు. ప్రమాదానికి కారణంపై అటు ఆర్టీసీ, ఇటు పోలీస్ ద్వారా విచారణకు ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన విషయం తెలియగానే ముఖ్య కార్యక్రమాలు అన్నింటినీ రద్దు చేసుకొని వెంటనే మంత్రి ఈటల రావడం పట్ల అక్కడున్నవారు హ్యట్సాఫ్ అంటూ కొనియాడారు.