లెజెండరీ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘మహానటి’.. ఈ సినిమా విజయవంతంగా దూసుకపోతోంది. అటు కొంతమంది విమర్శిస్తున్నా.. ప్రశంసలతోపాటు వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో అందంగా ఒదిగిపోయిన ప్రముఖ నటి కీర్తి సురేష్ సహా, ఈ చిత్రంలో పలు కీలక భూమికను పోషించిన ఇతర నటీనటులు, చిత్ర దర్శక నిర్మాతలు, సంగీత దర్శకుడితో పాటు ఇతర సిబ్బందిపై కూడా ప్రశంసంల వర్షం కురుస్తోంది. అయితే ఇదంతా ఒక ఎత్తయితే కొన్ని డిలిటెడ్ సన్నివేశాల వీడియోలు ఆకట్టుకుంటున్న తీరు మరో ఎత్తు. మహానటి సినిమా ఎంత సంచలన విజయాన్నిసృష్టిస్తోందో..అంతకంటే ఎక్కువగా డిలీటెడ్ సీన్లు, వీడియోలు యూట్యూబ్‌లో హల్ చేస్తున్నాయి. తాజాగా రాజేంద్రప్రసాద్, హీరోయిన్ కీర్తి సురేష్‌పై చిత్రీకరించిన ఒక ఆసక్తికర సన్నివేశం నెట్‌లో చక్కర్లు కొడుతోంది.ఆ వీడియో మీకోసం..
