ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షు వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రకు ఎక్కడ చూసిన ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన 600 అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయడంతో ప్రజలు ప్రస్తుతం వారికి న్యాయం చేయగలిగే నాయకుడు వైఎస్ జగన్ ని ఎంతగానో నమ్ముతున్నారు ఇచ్చిన మాట మీద నిలబడే నాయకుడు అంటూ ప్రజలు జగన్ గురించి మాట్లాడుతున్నారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి పెరుగుతున్నప్రజా బలం చూసి చాలామంది ప్రముఖ ,మాజీ రాజకీయ నాయకులు వైసీపీ పార్టీలోకి వలసలు మొదలు పెట్టినారు. అలాగే అధికార పార్టీ అయిన టీడీపీ నేతలు కూడా వైసీపీలోకి రావడానికి ఇప్పటికే చాలామంది ఉన్నట్లు వైసీపీ నాయకులు చెబుతున్నారు.
అందులో భాగంగానే ఇటీవల విజయసాయిరెడ్డి మంత్రి గంటా శ్రీనివాసరావు తమకి టచ్ లో ఉన్నట్లు త్వరలో పార్టీలోకి రాబోతున్నట్లు సంచలన కామెంట్ చేశారు. ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలు కూడా జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకునేందుకు సిద్దమయ్యారని తెలుస్తోంది. అయితే ఈ వరుసలో కర్నూల్ జిల్లా బనగానపల్లెకు చెందిన బీసీ జనార్థన రెడ్డి ముందంజలో ఉన్నారు. ఈయన 2014లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచినా కూడా పార్టీ తరపున చంద్రబాబు ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు. దీంతో బీసీ జనార్థన రెడ్డి, చంద్రబాబుపై సంతృప్తితో ఉన్నారు. అందుకే చంద్రబాబు నిర్వహించిన మినీ మహానాడు సభను కూడా ఈ నియోజకవర్గంలో ఇంత వరకూ ఏర్పాటు చేయలేదు. దీంతో ఇక వైసీపీలోకి అని సోషల్ మీడియా లో తెగ ప్రచారం జరుగుతంది. అంతేకాదు జగన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం అంటా చాలమంది వైసీపీలోకి చేరాడానికి రెడిగా ఉన్నట్లు తెలుస్తుంది.