రైతులకోసం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఐదు లక్షల రైతు బీమా పధకాన్ని అమలు చేయబోతున్నామని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈ ట ల రాజేందర్ అన్నారు .ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రెడ్ హిల్స్ లోని ఎఫ్ టాప్సీలో దేశంలో ఇన్సూరెన్స్ రంగ అవసరంపై నిర్వహించిన కాన్ఫరెన్స్ లో ఈటల పాల్గొన్నారు.
సందర్భంగా అయన మాట్లాడారు.పరిశ్రమలకు ఎలాంటి అంతరాయం లేకుండా కరెంట్ అందిస్తున్నామన్నారు. 10శాతం GSDP తో రాష్ట్రం అభివృద్దిలో ముందుందన్నారు.నాలుగేళ్లలో ప్రజా సంక్షేమం కోసం ఎన్నో కొత్త పధకాలు తీసుకొచ్చామన్నారు . రైతులకు ఉచిత నాణ్యమైన 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు.రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి 8వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నామని అయన అన్నారు.