ఇవాళ గవర్నర్ నరసింహన్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం అయ్యారు.గవర్నర్ నరసింహన్ గత ఐదు రోజులు దేశ రాజధాని డిల్లీ లో పర్యటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే గవర్నర్ నరసింహన్ హైదరాబాద్ చేరుకున్న తరువాత సీఎం కేసీఆర్ వెళ్లి కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై గవర్నర్ , సీఎం చర్చించారు. ఐదురోజుల పర్యటనలో భాగంగా… తెలంగాణ, ఏపీల్లోని పరిస్థితులను గవర్నర్ … ప్రధానమంత్రి, హోంమంత్రి… ఢిల్లీ పెద్దలకు రిపోర్ట్ చేశారు. ఢిల్లీలో గవర్నర్ జరిపిన మంతనాలు, కేంద్రం స్పందనపై సీఎం కేసీఆర్ వివరాలు అడిగి తెల్సుకుంటున్నట్టు సమాచారం.అంతేకాకుండా ఏపీ భవన్ ను తెలంగాణకు కేటాయించే అంశంపైనా కేసీఆర్ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే.. రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నోటీసు అంశంపైనా గవర్నర్ నరసింహన్ తో .. సీఎం కేసీఆర్ చర్చించే అవకాశాలున్నాయి.
SEE ALSO: