ప్రజలకు రక్షణగా ఉండే పోలీసు అధికారి వాహనమే చోరీకి గురైంది… ఏకంగా సీఐ వాహనాన్నేఓ యువకుడు ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. సూర్యాపేట రూరల్ సీఐగా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్‌రెడ్డి ఆత్మకూర్(ఎస్) మండల పోలీ్‌సస్టేషన్‌కు కేటాయించిన సుమోను కొన్నాళ్లుగా వాడుతున్నారు. అయితే శనివారం రాత్రి సూర్యాపేటలోని ఓ జిమ్ సెంటర్‌కు వెళ్లారు. సీఐ జిమ్‌లోకి వెళ్లగానే సుమో డ్రైవర్ సైదులు దగ్గరకు బైక్ పై తిరుపతి లింగరాజు అనే యువకుడు వచ్చాడు. సీఐ సార్ సుమో పక్కకు పెట్టమన్నారంటూ తాళాలు తీసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత సుమోతో ఉడాయించాడు. ఈ విషయాన్ని డ్రైవర్ సైదులు సీఐకి తెలిపాడు. అలర్టైన సీఐ వెంటనే పట్టణ పోలీసులతో పాటు సమీప పోలీస్ స్టేషన్లకు సమాచారం అందజేశారు. లింగరాజు సుమోను సద్దుల చెరువు కట్ట మీదుగా జాతీయ రహదారి చేరుకుని కోదాడ వైపు తీస్కెళ్లాడు. విషయం తెలుసుకున్న పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. చోరీకి గురైన 4 గంటల తర్వాత పోలీసులు సీసీ కెమెరాల సాయంతో నిందితుడిని గుర్తించారు.
ఏపీలోని కృష్ణా జిల్లా చిల్లకల్లు చెక్ పోస్టు దగ్గర అక్కడి పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడితో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
