2014 ఎన్నికల్లో ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ ను నిలబెట్టిన జిల్లాల్లో రాయలసీమలోని కర్నూల్ జిల్లా కూడా ఒకటి. కాని తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఇదే జిల్లాలోని ఎక్కువ మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీలో చేరిపోయారు. ఇలా వలసలు జరుగుతున్న తరుణంలో టీడీపీకి అతి పెద్ద షాక్ తగలనుందా అంటే ..నూటికి నూరు శాతం అవుననే సంకేతాలు కనబడుతున్నాయి. ఇప్పటికే కర్నూలు జిల్లా నుంచి మొన్న గంగుల,నిన్న శిల్పా బ్రదర్స్..మరియు బీజేపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని వైసీపీలో చేరడంతో వైసీపీ పార్టీ జిల్లాలోమంచి పట్టు సాధిస్తుంది.
see also:ఆ విషయంలో బాబుకు “64%”మంది జై కొట్టారు -జాతీయ మీడియా సర్వే..!
అంతేకాదు అధికారంలోకి వచ్చాక టీడీపీ ఏ జిల్లా నుండి అయితే వైసీపీ నేతలను లాక్కున్నారో.. అదే జిల్లాలో వైసీపీ పార్టీ టీడీపీకి చెక్ పెట్టేందుకు వ్యూహం రచిస్తోంది. అందుకే రాయలసీమకు చెందిన ముఖ్యనాయకుల్లో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి వైసీపీలోకి ఆహ్వనించిరనే వార్త హల్ చల్ చేస్తుంది. ఈయనతో పాటు సతీమణి ..డోన్ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ కూడ వైసీపీలో చెరుతున్నట్లు విశ్వసనియ వర్గాల సమచారం. అయితే కోట్ల విజయభాస్కర్‌రెడ్డి తనయుడికి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి కర్నూలు జిల్లా రాజకీయాలపై బాగానే పట్టు ఉంది. ఇప్పటికీ కాంగ్రెస్ లోనే కొనసాగుతున్న కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఆయన కుటుంబం త్వరలోనే వైసీపీలో చేరుతారనే ప్రచారం ఎప్పటి నుంచో సాగుతోంది. కాని మళ్లి ఇప్పుడు ఈ వార్త బయటకు రావడంతో కోట్ల కుటుంబం ఇక ఖచ్చితంగా వైసీపీ కండువా కప్పుకుంటారని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇక ఇది కనుక జరిగితే వైసీపీ దెబ్బకు..టీడీపీ అబ్బా అనాల్సిందే..